సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్

by సూర్య | Mon, Aug 08, 2022, 06:50 PM

అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కించిన కొత్త చిత్రం "సీతారామం". మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన చిత్రమిదే. బాలీవుడ్ టెలివిజన్ యాక్టర్ మృణాల్ ఠాకూర్ కు ఈ సినిమాతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ దక్కింది. శుక్రవారం విడుదలైన ఈ మూవీ క్లాసిక్ ఎపిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థానం సంపాదించడమే కాక, చాన్నాళ్లుగా డ్రైగా సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్ ను కలెక్షన్లతో నింపుతుంది.
ఐతే, ఈ సినిమా జీసీసీ దేశాలలో అంటే గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ (బహ్రెయిన్, కువైట్, యూఏఈ , ఒమన్ మిగిలినవి..  ) లలో బ్యాన్ చెయ్యబడింది. ఆ దేశాలలో దుల్కర్ కు చాలా స్ట్రాంగ్ మార్కెట్ ఉంది. దుల్కర్ గత చిత్రం "కురూప్" ఒక్క జీసీసీ టెర్రిటరీ నుండే పాతిక కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అలా చూసుకుంటే, సీతారామం ఓపెనింగ్ వీకెండ్ లోనే దాదాయూప్ 35కోట్ల వరకు రాబట్టి ఉండేది. ఇప్పటి వరకు పాతిక కోట్లను కలెక్ట్ చేసిన సీతారామం జీసీసీ దేశాలలో బ్యాన్ అవ్వడం వల్ల మూడురోజుల్లోనే పది కోట్లు నష్టపోయింది.  

Latest News
 
సిట్టింగ్ ఫోజులతో రీతూ వర్మ కిర్రాక్ ఫోజులు Sun, Sep 24, 2023, 12:00 PM
అందాలతో చంపేస్తున్నదిశా పటానీ Sun, Sep 24, 2023, 11:49 AM
'క‌న్న‌ప్ప‌'లో ప్రభాస్‌కు జోడీగా న‌య‌న‌తార‌ Sun, Sep 24, 2023, 10:57 AM
విడుదల తేదీని ఖరారు చేసిన 'ధృవ నచ్చతిరమ్' Sat, Sep 23, 2023, 08:57 PM
గోపీచంద్-శ్రీను వైట్ల సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ Sat, Sep 23, 2023, 08:47 PM