ఇండస్ట్రీలో కొత్త "మెగాస్టార్" అవతరణ ... వైరల్ హ్యాష్ ట్యాగ్

by సూర్య | Sat, Aug 06, 2022, 03:19 PM

టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ అంటే చిరంజీవినే. కొత్తగా నందమూరి కళ్యాణ్ రామ్ కు మెగాస్టార్ ట్యాగ్ ఇచ్చి కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. ఆచార్య తో మూతపడ్డ థియేటర్లు ఆపై అంటే సుందరానికి, విరాటపర్వం, పక్కా కమర్షియల్, ది వారియర్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ ...ఇలా ఎన్ని సినిమాలు విడుదలైనా అంతగా తెరుచుకోలేదు. నిన్న విడుదలైన కళ్యాణ్ రామ్ బింబిసార థియేటర్లకు కొత్త కళను తీసుకొచ్చింది. చాన్నాళ్ల తరవాత థియేటర్లకు హౌస్ ఫుల్ బోర్డులు దర్శమిస్తున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్లతో ఊపిరి పీల్చుకుంటుంది.
కళ్యాణ్ రామ్ కెరీర్లో గట్టిగ మూడే మూడు హిట్లున్నాయి. 2005 లో వచ్చిన అతనొక్కడే, హరేరామ్ (2008), పటాస్ (2015). ఇక అప్పటినుండి కళ్యాణ్ సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా రిలీజయిన బింబిసార కళ్యాణ్ కు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడమే కాక మెగాస్టార్ ట్యాగ్ ను తీసుకొచ్చింది. దీంతో కొంతమంది అభిమానులు కళ్యాణ్ రామ్ ను రియల్ మెగాస్టార్ అని పిలుచుకుంటున్నారు. సాలిడ్ మార్కెట్ లేని కళ్యాణ్ రామ్ బింబిసార హౌస్ ఫుల్ బోర్డు లతో, ఎక్స్ట్రా థియేటర్లతో ఇన్నాళ్ల విజయ కాంక్షను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు.

Latest News
 
`పొన్నియిన్ సెల్వన్` మూవీ నుండి `చోళ చోళ 'అనే లిరికల్ సాంగ్ రిలీజ్ Fri, Aug 19, 2022, 09:54 PM
మంచి లక్ష్మికి దక్కిన అరుదైన గౌరవం Fri, Aug 19, 2022, 09:32 PM
సినీ పరిశ్రమలో విషాదం.....ప్రముఖ దర్శకుడు కన్నుమూత Fri, Aug 19, 2022, 09:11 PM
సోషల్ మీడియా హ్యాండ్లింగ్ పై ఫ్యాన్స్ కు విజయ్ ఫుల్ క్లారిటీ Fri, Aug 19, 2022, 06:04 PM
సుధీర్ "గాలోడు" నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ Fri, Aug 19, 2022, 05:53 PM