సెన్సేషనల్ : తొలిరోజే పెట్టుబడిలో సగం రాబట్టిన బింబిసార

by సూర్య | Sat, Aug 06, 2022, 03:17 PM

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం బింబిసారుడి మ్యానియాతో ఊగిపోతోంది. థియేటర్లన్నీ ఆడియన్స్ తో, హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడిపోతున్నాయి. నిన్న విడుదలైన బింబిసార తొలిషోతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, థియేటర్లలో దూసుకుపోతుంది. నలభై కోట్లతో, కళ్యాణ్ రామ్ కెరీర్లో భారీ బడ్జెట్ తో నిర్మింపడిన ఈ చిత్రం ఏపీ, తెలంగాణాలలో పద్నాలుగు కోట్ల థియేట్రికల్ బిజినెస్ ను జరుపుకుంది. తొలి రోజు కలెక్షన్లతోనే బింబిసార నిర్మాతలు పెట్టుబడి పెట్టినదాంట్లో సగం వచ్చేసిందట. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణాలలో దాదాపు ఏడు కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం ఈ వీకెండ్ లో మరిన్ని కలెక్షన్లను రాబట్టి నిర్మాతలకు లాభాల పంట పండించేలా కనిపిస్తుంది.
కొత్త దర్శకుడు వసిష్ఠ తెరకెక్కించిన ఈ చిత్రంలో క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తామీనన్ హీరోయిన్లుగా నటించగా, శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ రాజ్, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు.

Latest News
 
`పొన్నియిన్ సెల్వన్` మూవీ నుండి `చోళ చోళ 'అనే లిరికల్ సాంగ్ రిలీజ్ Fri, Aug 19, 2022, 09:54 PM
మంచి లక్ష్మికి దక్కిన అరుదైన గౌరవం Fri, Aug 19, 2022, 09:32 PM
సినీ పరిశ్రమలో విషాదం.....ప్రముఖ దర్శకుడు కన్నుమూత Fri, Aug 19, 2022, 09:11 PM
సోషల్ మీడియా హ్యాండ్లింగ్ పై ఫ్యాన్స్ కు విజయ్ ఫుల్ క్లారిటీ Fri, Aug 19, 2022, 06:04 PM
సుధీర్ "గాలోడు" నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ Fri, Aug 19, 2022, 05:53 PM