బాలీవుడ్ స్టార్ హీరోని పట్టించుకోని రాజమౌళి !!

by సూర్య | Fri, Aug 05, 2022, 04:42 PM

టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆపై RRR తో ఇండియాలో, విదేశాలలో కూడా రాజమౌళి పేరు మారు మోగిపోతుంది. ఆఖరికి హాలీవుడ్ టాప్ డైరెక్టర్లు రస్సో బ్రదర్స్ కూడా రాజమౌళితో పని చెయ్యాలని కోరుకుంటూ, మీడియా సుముఖంగానే క్లియర్ స్టేట్మెంట్ ను జారీ చేసారు.
కానీ, జక్కన్న మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా, మహేష్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా మునిగిపోయాడు. రాజమౌళితో ఎప్పటినుండో సినిమా చెయ్యాలనుకుంటున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ను కూడా జక్కన్న అస్సలు పట్టించుకోవట్లేదు. బాహుబలి టైంలోనే ఆమీర్ రాజమౌళితో సినిమా చెయ్యాలనుందని చెప్పగా, రీసెంట్గా "లాల్ సింగ్ చద్దా" ప్రమోషన్స్ లో భాగంగా కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న ఆమీర్ అదే మాటను మరొకసారి చెప్పి, జక్కన్నతో పని చేసేందుకు తానెంత తపన పడుతున్నాడో క్లియర్ చేసాడు. ఆమీర్ మాటలకు, జక్కన్న నుండి మాత్రం ఎలాంటి స్పందన రాకపోవడం విశేషం.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM