![]() |
![]() |
by సూర్య | Fri, Aug 05, 2022, 04:22 PM
డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండల "లైగర్" నుండి 'ఆఫత్' అనే పాట ఈ సమయానికి విడుదల కావాల్సి ఉండగా, కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఈ పాట విడుదలను రేపు ఉదయం తొమ్మిదింటికి వాయిదా వేస్తున్నట్టు, అందుకు ఫ్యాన్స్ కు సారీ చెప్తూ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు. నిన్న విడుదలైన ఆఫత్ సాంగ్ ప్రోమో ఇప్పటికి 2.3 మిలియన్ వ్యూస్ రాబట్టి యూట్యూబులో దూసుకుపోతుంది.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25న పాన్ ఇండియా భాషల్లో విడుదలకు సిద్ధమైంది.