"హ్యాపీ బర్త్ డే" డిజిటల్ & శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థలు

by సూర్య | Tue, Jul 05, 2022, 10:37 AM

"అందాల రాక్షసి" ఫేమ్ లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "హ్యాపీ బర్త్ డే". రితేష్ రానా డైరెక్షన్లో డిఫరెంట్ కామెడీ జోనర్ తో తెరకెక్కిన ఈ మూవీ జూలై 8వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు, హ్యాపీ బర్త్ డే పోస్ట్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే భారీ మొత్తానికి అమ్ముడైపోయాయట. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రఖ్యాత నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చెయ్యగా, శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ జెమినీ ఛానెల్ సొంతం చేసుకుందట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, విద్యుల్లేఖ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.   

Latest News
 
తలపతి విజయతో నటించనున్న త్రిష Mon, Aug 08, 2022, 10:28 PM
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM