రుద్రుడిగా లారెన్స్... ఫస్ట్ లుక్ రిలీజ్

by సూర్య | Thu, Jun 23, 2022, 07:05 PM

కామెడీ, హార్రర్ థ్రిల్లర్ లను రూపొందించడంలో సిద్ధహస్తుడైన కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ లారెన్స్, చాన్నాళ్ల తర్వాత వెండితెరపై కనిపించబోతున్నాడు. కథిరేసన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఒక ఇంటెన్స్ యాక్షన్ సినిమా "రుద్రుడు"లో లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ప్రియాభావని ఇందులో హీరోయిన్ కాగా, శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు తొంభైశాతం షూటింగును పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొంచెంసేపటి క్రితమే మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసారు. ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ ... ఇట్ ఈజ్ క్రియేటెడ్ అనే శీర్షికతో విడుదలైన ఈ పోస్టర్ లో ఒక విచిత్ర ఆకారంలో ఉన్న ఆయుధాన్ని పట్టుకున్న లారెన్స్ శత్రువులను ఛేదిస్తూ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఏర్పరిచింది.
ఫైవ్ స్టార్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదలకానుంది.

Latest News
 
ప్రముఖ నటుడు కిషోర్ దాస్ కన్నుమూత Sun, Jul 03, 2022, 10:53 PM
లారెన్స్ 'రుద్రుడు' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Jul 03, 2022, 10:26 PM
సత్యదేవ్ 'కృష్ణమ్మ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ Sun, Jul 03, 2022, 10:20 PM
ఓటిటిలో సందడి చేయనున్న `అంటే సుందరానికి` మూవీ Sun, Jul 03, 2022, 10:11 PM
నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ అప్డేట్ Sun, Jul 03, 2022, 10:00 PM