భయపెడుతున్న "విక్రాంత్ రోణ" ట్రైలర్ ...!

by సూర్య | Thu, Jun 23, 2022, 06:53 PM

కన్నడ సూపర్ స్టార్ కిచ్ఛా సుదీప్ కొత్త చిత్రం విక్రాంత్ రోణ. అనూప్ భండారీ దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. సుదీప్ తో పాటు ఈ సినిమాలో నిరూప్ భండారీ, నీతా అశోక్ ప్రధాన పాత్రలు పోషించారు. 3D లో ప్రపంచవ్యాప్తంగా 19 ఆగష్టు 2021 విడుదలవ్వాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల జూలై 28వ తేదీన విడుదలవడానికి సిద్ధమవుతోంది.
ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. మూవీ నేపధ్యాన్ని మొత్తం ట్రైలర్ లోనే చూపించేసాడు దర్శకుడు. మారుమూల గ్రామానికి పోలీసాఫీసర్ గా వెళ్లిన సుదీప్ ఆ ఊరి ప్రజలను భయపెడుతున్న రహస్యాలను ఒక్కొక్కటిగా చేధిస్తాడు. ఈ క్రమంలో వీటన్నింటికి అతనే కారణమని తెలుసుకుంటాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ చాలా బాగున్నాయి. డిఫరెంట్ వరల్డ్ కు తీసుకెళ్లిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. వెండితెరపై కూడా విక్రాంత్ మ్యాజిక్ చేస్తే ఈ సినిమాకు తిరుగుండదు.
తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో రూపొందిన ఈ సినిమాను మేకర్స్ సుమారు 50దేశాలలో విడుదల చేయబోతున్నారు. జీ స్టూడియోస్, షాలిని ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతిధిగా కనిపించనున్నారు.


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM