"చోర్ బజార్" నుండి చోర్ కియారే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ 

by సూర్య | Thu, Jun 23, 2022, 12:18 PM

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ పూరి హీరోగా, "దళం","జార్జ్ రెడ్డి" వంటి చిత్రాలతో విమర్శకుల మన్ననలను పొందిన జీవన్ రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం "చోర్ బజార్". ఇందులో గెహనా సిప్పి కధానాయిక. ఈ చిత్రాన్ని ఐవి ప్రొడక్షన్స్ పతాకంపై బీఏ రార్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవడానికి రెడీ ఐన చోర్ బజార్ ప్రస్తుతం ప్రమోషన్స్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో సినిమా నుండి వరసగా లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తుంది టీం. మొన్ననే బచ్చన్ సాబ్, కదలదు పాదం అనే లిరికల్ పాటలను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా చోర్ కియారే అనే ఫుల్ వీడియో సాంగ్ ను రీలిజ్ చేసారు. ఈ పాటను స్ఫూర్తి జితేందర్ ఆలపించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.

Latest News
 
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM
రకుల్ ప్రీత్ సింగ్ ట్రెండీ లుక్ Tue, Jul 05, 2022, 10:56 AM
డీజేటిల్లు 2 హీరోయిన్ మారింది ? Tue, Jul 05, 2022, 10:52 AM
"హ్యాపీ బర్త్ డే" డిజిటల్ & శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థలు Tue, Jul 05, 2022, 10:37 AM
పృథ్విరాజ్ "కడువా" మూవీ డిజిటల్ పార్టనర్ ఖరారు... Tue, Jul 05, 2022, 10:28 AM