యూట్యూబ్ లో మోతమోగిస్తున్న రామ్ "విజిల్" ...

by సూర్య | Thu, Jun 23, 2022, 12:20 PM

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని త్వరలోనే "ది వారియర్" గా ప్రేక్షకులను పలకరించనున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ సరసన కృతిశెట్టి, అక్షర గౌడ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్గా కనిపిస్తుండగా, నదియా ముఖ్యపాత్రలో నటించనున్నారు. జూలై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో బుల్లెట్, దడ దడ అనే లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా సినిమా నుండి మూడో లిరికల్ సాంగ్ "విజిల్" ను విడుదల చేసారు.
దేవిశ్రీప్రసాద్ ఎనర్జిటిక్ మ్యూజిక్ కు, రామ్,కృతిల మాస్ స్టెప్పులు జత కలవడంతో ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన కొన్ని గంటల్లోనే 3.5 మిలియన్ వీక్షణలతో యూట్యూబులో దూసుకుపోతుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పాటను ఆంథోనీ దాసన్, శ్రీనిష ఆలపించగా, సాహితి లిరిక్స్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.

Latest News
 
'ప్రతినిధి 2' ని USAలో విడుదల చేస్తున్న ప్రముఖ బ్యానర్ Tue, Apr 23, 2024, 03:45 PM
తెలుగులో 'నాయట్టు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Tue, Apr 23, 2024, 03:39 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కూలీ' టైటిల్ టీజర్ Tue, Apr 23, 2024, 03:37 PM
'నడికర్' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Tue, Apr 23, 2024, 03:34 PM
రీ-రిలీజ్ ఉన్న సిద్ధంగా ఉన్న "రౌడీ బాయ్స్‌" Tue, Apr 23, 2024, 03:19 PM