హీరో విజయ్ బర్త్ డే స్పెషల్ ఏంటో తెలిస్తే... ఖచ్చితంగా షాక్ అవుతారు!

by సూర్య | Thu, Jun 23, 2022, 12:16 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ పుట్టినరోజు నిన్న జరిగింది. ఈ మేరకు పలువురు సినీ సెలెబ్రిటీలు, సన్నిహితులు, ఫ్యాన్స్ విజయ్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసారు. విజయ్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమాన సంఘాలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఐతే, వీటన్నిటికీ దూరంగా విజయ్, తన కొత్త సినిమా "వారసుడు" సెట్స్ లోనే బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్నారట. నిన్నటితో 48వ పడిలోకి అడుగుపెట్టిన విజయ్, పుట్టినరోజు నాడు ఎలాంటి హంగూఆర్భాటాలకు పోకుండా చాలా సింపుల్ గా ఉన్నారట. సాధారణ రోజుల్లో షూటింగ్ లో పాల్గొన్నట్టే నిన్నకూడా వారసుడు షూటింగ్ లో పాల్గొన్నారట. ఈ విషయాన్ని వారసుడు చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, విజయ్ తో దిగిన ఫోటోను తమన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. దీంతో తమ అభిమాన హీరో బర్త్ డే ఇంత సింపుల్ గా జరిగిందా? అని విజయ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Latest News
 
రేపు రిలీజ్ కానున్న 'ఏనుగు' మూవీ Thu, Jun 30, 2022, 11:36 PM
మా ఇద్దరు మధ్య ఉంది స్నేహ బంధం మాత్రమే : సీనియర్ నటుడు నరేష్ Thu, Jun 30, 2022, 11:19 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'మేజర్' మూవీ Thu, Jun 30, 2022, 11:10 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న 'పక్క కమర్షియల్' మూవీ Thu, Jun 30, 2022, 11:02 PM
'కేజీఎఫ్' సినిమా నటుడికి కారు ప్రమాదం Thu, Jun 30, 2022, 10:04 PM