బంపరాఫర్ కొట్టేసిన 'సాహో' డైరెక్టర్... పవన్ కాకున్నా మరో మెగాహీరోతో ...

by సూర్య | Thu, Jun 23, 2022, 11:33 AM

చిత్రపరిశ్రమ భలే విచిత్రంగా ఉంటుంది. ఒక్క హిట్ కొడితే ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. ఖర్మకాలి ఫ్లాప్ వచ్చిందో ...అంతే.... పాతాళానికి తొక్కేస్తుంది. తిరిగి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ విషయం ఒక డైరెక్టర్ విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఆయనే సుజిత్.
తొలిసినిమా "రన్ రాజా రన్" తో ప్రేక్షకుల మనసు దోచుకున్న సుజిత్ ఆపై ప్రభాస్ తో "సాహో" ను తెరకెక్కించాడు. ఆ సినిమాకు తెలుగులో చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాలేదు దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సాహో భారీ ఫ్లాప్ గా నిలిచింది. కానీ, సాహో ఉత్తరాదిన ఫర్వాలేదనిపించింది. సాహో పరాజయంతో సుజిత్ ను కన్నెత్తి చూసే నిర్మాతలు కానీ, హీరోలు కానీ లేకపోయారు.
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి తో "గాడ్ ఫాదర్", పవన్ కళ్యాణ్ తో "తేరి" రీమేక్ లకు సుజిత్ డైరెక్షన్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఇవేమి కార్యరూపం దాల్చలేదు. తాజాగా సుజిత్ కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బంపరాఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో, వరుణ్ తేజ్ హీరోగా నటించబోయే ఒక సినిమాకు సుజిత్ డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నారని చిత్రసీమ కోడై కూస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట. ఇది పూర్తవగానే, సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చెయ్యబోతున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి.

Latest News
 
రేపు రిలీజ్ కానున్న 'ఏనుగు' మూవీ Thu, Jun 30, 2022, 11:36 PM
మా ఇద్దరు మధ్య ఉంది స్నేహ బంధం మాత్రమే : సీనియర్ నటుడు నరేష్ Thu, Jun 30, 2022, 11:19 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'మేజర్' మూవీ Thu, Jun 30, 2022, 11:10 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న 'పక్క కమర్షియల్' మూవీ Thu, Jun 30, 2022, 11:02 PM
'కేజీఎఫ్' సినిమా నటుడికి కారు ప్రమాదం Thu, Jun 30, 2022, 10:04 PM