డైరెక్టర్ పూరి పై బండ్ల గణేష్ వైరల్ కామెంట్స్ 

by సూర్య | Thu, Jun 23, 2022, 11:28 AM

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ నటించిన కొత్త చిత్రం "చోర్ బజార్". "రొమాంటిక్"తో సూపర్ హిట్ కొట్టిన ఆకాష్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా, బి. జీవన్ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు. ఇందులో గెహనా సిప్పి కధానాయిక. సుబ్బరాజు, అర్చన, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఐవి ప్రొడక్షన్స్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవడానికి రెడీ ఐన చోర్ బజార్ ప్రస్తుతం ప్రమోషన్స్ జరుపుకుంటుంది.
ఈ క్రమంలో నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. అందరూ అనుకున్నట్టు ఈ ఈవెంట్ కు పూరి జగన్నాధ్ రాలేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కార్యక్రమానికి హాజరైన వివాదాస్పద నిర్మాత బండ్ల గణేష్ పూరీని కడిగిపారేశారు. ఎందరో స్టార్ల పిల్లలను మెగాస్టార్లుగా, సూపర్ స్టార్లుగా మలిచిన పూరి సొంత కొడుకును ప్రమోట్ చేసేందుకు ఈవెంట్ కు హాజరు కాకపోవడం నిజంగా బాధాకరమని, అంత సమయం ఆయనకు లేదా అని నిలదీశారు. ప్రస్తుతం పూరి గురించి బండ్ల గణేష్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐతే, పూరి ముంబైలో తన తదుపరి సినిమా షూటింగ్ నిమిత్తం బిజీగా ఉండడమే ఈ ఈవెంట్ కు రాకపోవడం వెనకున్న నిజమైన కారణమని తెలుస్తుంది.

Latest News
 
ఈ వారం అలరించనున్న సినిమాలివి Tue, Jul 05, 2022, 12:25 PM
అల్లుఅరవింద్ చేతికి లాల్ సింగ్ చద్దా తెలుగు రైట్స్ Tue, Jul 05, 2022, 12:24 PM
కొత్త సినిమాను ప్రకటించిన సుమంత్ Tue, Jul 05, 2022, 12:20 PM
విజయ్ సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్? Tue, Jul 05, 2022, 12:19 PM
డబుల్ మీనింగ్ కామెంట్లు చేయను: నాగచైతన్య Tue, Jul 05, 2022, 12:17 PM