మొక్కలు నాటిన బాలీవుడ్ స్టార్ హీరో !

by సూర్య | Thu, Jun 23, 2022, 11:23 AM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాడన్న విషయం తెలిసిందే కదా. తన కొత్త సినిమా "కభీ ఈద్ కభీ దివాళి" షూటింగ్ నిమిత్తం మరో నెలరోజుల పాటు సల్మాన్ హైదరాబాద్ లోనే ఉండనున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో, సల్మాన్ ఖాన్ "గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఆయనతో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటటం చాలా  ఆనందం గా  ఉందని, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, అందుకు ప్రతిఒక్కరు తమ వంతు సాయంగా వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు. అలానే చెట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో, అక్కడ పుష్కలంగా నీరు దొరుకుతుంది అని చెప్పారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మొట్టమొదట గా జులై 17, 2018 లో, హరా హై తో భరా హై అనే నినాదం తో  తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఇప్పటికే చాలామంది సెలెబ్రిటీ లు ,రాజకీయ నాయకులు ,వ్యాపార వేత్తలు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు.

Latest News
 
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM
సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా...కారణం? Mon, Aug 08, 2022, 06:05 PM