బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆ సినిమా ఓటిటిలో మాత్రం డిజాస్టర్

by సూర్య | Wed, Jun 22, 2022, 06:24 PM

సౌత్ సినిమాలు నార్త్ లో వందల కోట్లు వసూలు చేస్తుంటే, హిందీ  సినిమాలు కనీసం నార్త్ లో బ్రేక్ ఈవెన్ సాధించలేక ఉసూరుమంటున్న సమయంలో కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులాయియా2 చిత్రం విడుదలై అద్భుతమైన కలెక్షన్లతో బాలీవుడ్ పరువును నిలబెట్టింది. గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2007లో అక్షయ్ కుమార్ నటించిన భూల్ భులాయియా కి సీక్వెల్ గా తెరకెక్కింది. హార్రర్ కమ్ కామెడీ జోనర్ లో నడిచే ఈ చిత్రానికి బాలీవుడ్ జనాలు బాగానే కనెక్ట్ అయ్యారు.
మే 20న రిలీజ్ ఐన ఈ మూవీ ఏకధాటిగా నాలుగు వారాల పాటు థియేటర్లలో రన్ అయ్యి, రూ. 180 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. జూన్ 19వ తేదీ నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ కు ఓటిటిలో వస్తున్న రెస్పాన్స్ కు సంబంధమే లేదు. భూల్ భులాయియా 2 ను డిజిటల్ లో చూసిన చాలామంది ఈ సినిమాలో ఎలాంటి భయంకరమైన సీన్లు కానీ, కడుపుబ్బా నవ్వించే కామెడీ కానీ లేవని విమర్శిస్తున్నారు. ప్రియమణి నటించిన ప్లాప్ చిత్రం "చారులత" నుండి క్లైమాక్స్ ను కాపీ చేసారని కూడా అంటున్నారు. టబు వంటి సీనియర్ నటీమణి నటన, కియారా గ్లామర్ తప్పించి ఈ సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమిలేదని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారట.

Latest News
 
రౌడీ హీరో హాట్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా? Sat, Aug 13, 2022, 08:33 PM
"లైగర్" తో విజయ్ ఖాతాలో క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులు? Sat, Aug 13, 2022, 08:21 PM
ముంబైలో "లైగర్" స్పెషల్ ప్రీమియర్ ..? Sat, Aug 13, 2022, 08:05 PM
కార్తికేయ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ Sat, Aug 13, 2022, 07:46 PM
వెంకీమామ టాలీవుడ్ ఎంట్రీకి 36 ఏళ్ళు Sat, Aug 13, 2022, 07:38 PM