డిజిటల్ లో "విక్రమ్" హంగామా ...ఎప్పుడంటే?

by సూర్య | Wed, Jun 22, 2022, 06:27 PM

చాన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్ కు "విక్రమ్" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నిచ్చింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, హీరో సూర్య నటించారు. రెండు వారాల క్రితం విడుదలైన ఈ సినిమాకు ధియేటర్ల వద్ద ఇంకా రష్ తగ్గలేదు. తమిళం, తెలుగు, హిందీ బాక్సాఫీస్ ల వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది. అన్ని భాషల్లో కలిపి విక్రమ్ సినిమాకు ఇప్పటివరకు రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని తెలుస్తుంది. ఇటీవలే విక్రమ్ మూవీ, తమిళనాడులో చాన్నాళ్లుగా పదిలంగా ఉన్న బాహుబలి 2 రికార్డును బద్దలుకొట్టి, కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ సొంతంగా నిర్మించారు.
జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ జూలై 8న ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. వెండితెరపై విక్రమ్ హడావిడి ఇంకా తగ్గనే లేదు, అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. త్వరలోనే, విక్రమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఎనౌన్ చేస్తూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయనుందట. విక్రమ్ మూవీ అనుకున్న సమయానికి ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుందా? లేక మనసు మార్చుకుని వెనక్కి వెళుతుందా? చూడాలి మరి...

Latest News
 
అనుపమ లేటెస్ట్ స్టిల్స్ Tue, Jul 05, 2022, 12:47 PM
నరేష్ వల్ల తీవ్రంగా నష్టపోయిన పవిత్ర లోకేష్ ..!! Tue, Jul 05, 2022, 12:44 PM
ఈ వారం అలరించనున్న సినిమాలివి Tue, Jul 05, 2022, 12:25 PM
అల్లుఅరవింద్ చేతికి లాల్ సింగ్ చద్దా తెలుగు రైట్స్ Tue, Jul 05, 2022, 12:24 PM
కొత్త సినిమాను ప్రకటించిన సుమంత్ Tue, Jul 05, 2022, 12:20 PM