పార్టీ మూడ్ ను తీసుకొస్తున్న విక్రాంత్ రోణా ఫస్ట్ లిరికల్ సాంగ్

by సూర్య | Wed, May 25, 2022, 04:24 PM

సౌత్ లో విడుదల కాబోతున్న మరో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం "విక్రాంత్ రోణా". కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా, అనూప్ భండారీ తెరకెక్కించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ చిత్రం విక్రాంత్ రోణా. ఈ సినిమాలో నీతా అశోక్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ సమర్పణలో షాలిని ఆర్ట్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్టుతో ఈ సినిమాని నిర్మించారు. అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందించారు. కరోనా కారణంగా రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3డి ఫార్మాట్ లో ప్రేక్షకులను అలరించటానికి జూలై 28న విడుదల కానుంది. 


తాజాగా ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్ రా రా రక్కమ్మ అనే పార్టీ సాంగ్ ను విడుదల చేసారు. సునిధి చౌహన్, నాకాష్ అజీజ్ ఆలపించారు. కిచ్చా సుదీప్ గ్రేస్ మూవ్మెంట్స్ కు, జాక్వెలిన్ మెస్మరైజింగ్ గ్లామర్ తోడవడంతో ఈ పాటకు యూట్యూబులో వీక్షణల తాకిడి ఎక్కువైంది. మంగళవారం నుండి మొదలు పెట్టిన ఈ సాంగ్ రిలీజ్ వచ్చే సోమవారం వరకు జరగనుంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో వరసగా విడుదల చేయనున్నారు. మంగళవారం హిందీలో ఈ పాటను రిలీజ్ చేసారు. అక్కడ కూడా ఈ పాటకు బిగ్ అప్లాజ్ వచ్చింది.

Latest News
 
రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, పీటీ ఉష Wed, Jul 06, 2022, 10:05 PM
రామ్ 'ది వారియర్' మూవీ అప్డేట్ Wed, Jul 06, 2022, 09:21 PM
ఐశ్వర్య రాజేష్ 'డ్రైవర్ జమున' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Jul 06, 2022, 09:15 PM
రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్ Wed, Jul 06, 2022, 09:08 PM
‘పొన్నియన్ సెల్వన్’ మూవీ నుండి ఐశ్వర్యరాయ్ లుక్ రిలీజ్ Wed, Jul 06, 2022, 09:03 PM