సల్మాన్ ఖాన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.. ఎవరో తెలుసా?

by సూర్య | Wed, May 25, 2022, 04:27 PM

సినీ పరిశ్రమలో ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. వచ్చిన అవకాశం ఫైనలైజ్ అవుతుందో లేదో కూడా నమ్మకం ఉండదు. ఈ నేపథ్యంలో చేతికందొచ్చినా ఒక బంగారు అవకాశాన్ని ఎవరైనా కాలదన్నుకుంటారా ? ఉన్నారు. ఆయనే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "పెళ్లిచూపులు" చిత్రంతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు తరుణ్ భాస్కర్. 2016లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఒకరకంగా విజయ్ దేవరకొండను లైం లైట్ లోకి తీసుకొచ్చింది తరుణ్ భాస్కరే. పెళ్లిచూపులు తర్వాత 2018లో "ఈ నగరానికి ఏమైంది" అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన తరుణ్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టును రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు. 


తరుణ్ తాజాగా ఆలీతో సరదాగా అనే టాక్ షో లో పాల్గొని, పర్సనల్, ప్రొఫెషనల్ కు సంబంధించిన ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే గోల్డెన్ ఛాన్స్ ను చేజేతులా వదులుకున్నట్టు తరుణ్ తెలిపారు. ఒక రీమేక్ సినిమా విషయమై, సల్మాన్ తరుణ్ ను ముంబైకి పిలిచి చర్చలు కూడా జరిపారని, చివరాఖరికి ఆ సినిమాను రిజెక్ట్ చేసారని చెప్పారు. అయితే, ఆ ఆఫర్ ను ఎందుకు రిజెక్ట్ చెయ్యాల్సి వచ్చిందో, ఆ రీమేక్ సినిమా ఏంటో తెలియాలంటే,ఈ వీకెండ్ లో ప్రసారమవబోయే ఆలీతో సరదాగా షో వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Latest News
 
'మై డియర్ భూతం' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Jul 06, 2022, 10:43 PM
రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, పీటీ ఉష Wed, Jul 06, 2022, 10:05 PM
రామ్ 'ది వారియర్' మూవీ అప్‌డేట్ Wed, Jul 06, 2022, 09:21 PM
ఐశ్వర్య రాజేష్ 'డ్రైవర్ జమున' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Jul 06, 2022, 09:15 PM
రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్ Wed, Jul 06, 2022, 09:08 PM