కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రష్యా వ్యతిరేక నిరసన...అర్థనగ్నంగా మహిళ

by సూర్య | Sat, May 21, 2022, 07:41 PM

ఉక్రెయిన్ పై రష్యా  సాగిస్తున్న ధారుణానికి నిదర్శనం ఈ ఘటన. దక్షిణ ఫ్రాన్స్‌లో మే 17 నుంచి ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవం జరుగుతోంది. అట్టహాసంగా జరిగే ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోకి ఓ ఉక్రెయిన్ మహిళ తన పైదుస్తులను తొలగించి నిరసన తెలిపింది. ఛాతిభాగంపైన ఉక్రెయిన్ జాతీయ జెండా, వీపు మీద స్కమ్ అనే పదాన్ని పెయింట్ వేయించుకుంది. అలా ఉన్న ఆమె అందరూ చూస్తుండగా మోకాళ్లపై కూర్చొని మాపై అత్యాచారాలు ఆపండి అంటూ బిగ్గరగా అరచి నిరసన వ్యక్తం చేసింది.


కట్టుదిట్టమైన భద్రతా.. సినీ తారల కోలాహాలంగా ఉండే ప్రాంతంలో ఆ మహిళ నగ్నంగా ప్రవేశించింది. తారల తళుకులతో కళకళలాడే... రెడ్ కార్పెట్‌పై ఓ మహిళ ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చి నించుంది. ఆమె శరీరం ముందు భాగంలో మాత్రం స్టాప్ రేపింగ్ హజ్ అని రాసి ఉంది. ఆమె ఓ ఉక్రెయిన్ మహిళ. రష్యా బలగాలు తమపై చేస్తున్న అత్యాచారాలకు నిరసనగా ఫాన్స్‌లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని రెడ్ కార్పెట్‌పై  ఒంటరిగా ఇలా నిరసన తెలిపింది. ఈ హఠాత్ పరిణామానికి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.


ఆ పరిణామానికి అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమె దగ్గరకు పరుగెత్తుకెళ్లి వెళ్లి ఒక కోటను కప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో 'త్రీ థౌజెండ్ ఇయర్స్ ఆఫ్ లాంగింగ్' సినిమాకు సంబంధించిన ఇడ్రిస్ ఎల్బా, టిల్డా స్వింటన్ వంటి ప్రముఖ సినీ నటులు కూడా ఉన్నారు. నిజానికి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన దగ్గర నుంచి అక్కడి మహిళలపై రష్యన్ బలగాలు అత్యాచారాలు చేస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. ఎంతో మంది మహిళలు కూడా స్థానిక మీడియాకు అదే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో రష్యా సైనికుల తీరును నిరసిస్తూ.. ఉక్రెయిన్ మహిళ ఇలా తన ఆందోళన తెలిపింది.


ఇదిలావుంటే ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉక్రెయిన్‌లో జరుగుతున్న దారుణాల గురించి ఆ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం వేడుకల రోజున తెలిపారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా ఈవెంట్‌లో ఒకటి. ప్రతి ఏటా వేసవిలో ఫ్రాన్స్‌‌లోని కేన్స్‌లో జరుగుతుంది. ఈ చలనచిత్రోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల ప్రీమియర్లు, ప్రదర్శనలు జరుగుతాయి.

Latest News
 
ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి Fri, May 03, 2024, 11:52 AM
మినీ డ్రెస్ లో రాశి ఖన్నా ఫోజులు Fri, May 03, 2024, 11:46 AM
‘టిల్లూ క్యూబ్‌’లో పూజా హెగ్డే? Fri, May 03, 2024, 10:34 AM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM