అంటే సుందరానికి మూవీ నుండి మ్యూజికల్ అప్డేట్

by సూర్య | Sat, May 21, 2022, 01:38 PM

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ డైరెక్ట్ గా చేస్తున్న తొలి తెలుగు చిత్రమిదే. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యార్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయినప్పటి నుండి చిత్రబృందం ఎదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ వచ్చేలా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, టీజర్, లిరికల్ సాంగ్ లకు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ దక్కింది.     


తాజాగా ఈ సినిమా నుండి మరో లిరికల్ సాంగ్ పై నాని బిగ్ అప్డేట్ ఇచ్చారు. సోమవారం రోజున అంటే మే 23న  ‘రంగో రంగ..’ అనే లిరికల్ పాటను చిత్ర యూనిట్ విడుదల చేయబోతున్నట్లు నాని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో నాని ఒక బ్రాహ్మణ యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నారు. అలాగే ఆయ‌న ప్రేమించే క్రిస్టియన్ యువ‌తి పాత్ర‌లో నజ్రియా నాజిమ్ క‌నిపించ‌నున్నారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM