ప్రొఫెసర్ పాత్రలో పవన్ కళ్యాణ్

by సూర్య | Sat, May 21, 2022, 12:32 PM

పవన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు. ఆయన అభిమానుల సంతోషానికి అవధులు ఉండవు. పోలీస్‌గా, న్యాయవాదిగా ఇలా పలు పాత్రల్లో ఆయన కనిపించారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తిరిగి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హీరోగా వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో హిట్ కొట్టారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ తారాగణం నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాను పవన్ చేయనున్నారు.

ఈ సినిమా గురించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ పాత్రను దర్శకుడు హరీష్ శంకర్ రివీల్ చేశారు. ఇందులో ఆయన ప్రొఫెసర్ పాత్రలో నటించనున్నారని చెప్పారు. దీంతో పవన్ పోషించనున్న పాత్రపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనుంది. ఇవే కాకుండా పట్టాలెక్కాల్సి ఉన్న మరిన్ని సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా, బండ్ల గణేష్ నిర్మాణంలో మరో సినిమా తెరకెక్కనుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM