బాహుబలి, దేవసేనలకే ఇంకా పెళ్లి కాలేదు.. నా పెళ్ళికి తొందరేముంది - అడవిశేష్

by సూర్య | Fri, May 20, 2022, 10:11 PM

అడవి శేష్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం మేజర్. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించటానికి శేష్ ఇదివరకెన్నడూ లేని విధంగా కష్టపడుతున్నాడు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి ఈ మూవీ కి తగినంత హైప్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మీ వివాహం ఎప్పుడని అడిగిన ప్రశ్నకు శేష్ దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. బాహుబలి ప్రభాస్, దేవసేన అనుష్కలకే ఇంకా పెళ్లి కాలేదు అంటూ ఆన్సర్ ఇచ్చాడు. అంటే, తనకంటే పెళ్లి కావలసిన వారు చాలా మందే ఇండస్ట్రీ లో ఉన్నారు, వారే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటే, నేనెంత? అని ఇండైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారట. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్,A +S మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2008 ముంబై  దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM