అవి తిరిగి పొందాలంటే 'శేఖర్' హిట్ అవ్వాల్సిందే - రాజశేఖర్

by సూర్య | Thu, May 19, 2022, 09:09 PM

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం 'శేఖర్'. ఈ మూవీని సీనియర్ నటీమణి, రాజశేఖర్ భార్య జీవిత డైరెక్ట్ చేసారు. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఇందులో కీలక పాత్రను పోషించారు. మలయాళ సూపర్ హిట్ చిత్రం జోసెఫ్ కు తెలుగు రీమేక్ గా జీవిత శేఖర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ముస్కాన్,ఆత్మీయ రాజన్, అభినవ్ , రవి వర్మ కీలక పాత్రలను పోషించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదలవగా, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. 


మే 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు కొద్ది రోజుల నుండి చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ... శేఖర్ సినిమాకు ముందు నాకు ఆస్తులుండేవి. శేఖర్ తర్వాత ఆస్తులు కాదు అప్పులు మిగిలాయి. అప్పులు తీరి ఆస్తులను తిరిగి పొందాలంటే శేఖర్ సినిమాను ప్రతి ప్రేక్షకుడు ధియేటర్ కు వెళ్లి చూడాలి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా... శేఖర్ చిత్రం కోసం చాలా కష్టపడ్డాను. సినిమా ప్రారంభించేముందు నేను కోవిడ్ కు గురయ్యాను. నెలన్నర రోజులు హాస్పిటల్ లోనే ఉన్నాను. ఇక తిరిగి నేను నటించలేనని అర్ధమైపోయింది. ఇదే విషయాన్ని నా కుటుంబసభ్యులందరికీ చెప్పాను. ఆ సమయంలో జీవిత నాలో ఆత్మస్థైర్యాన్ని నింపి శేఖర్ మూవీని చేసేందుకు నన్ను సిద్ధపరిచింది. ఈ క్రమంలో నా కూతుళ్లు శివాని, శివాత్మిక లు నాకు ఎన్నో సేవలు చేసారు. ఆఫ్ స్క్రీన్ లో జీవిత నా భార్య అయినా కెమెరా ముందుకు వచ్చేసరికి ప్రొఫెషనల్ డైరెక్టర్గ్ లాగానే బిహేవ్ చేసేది. ఏదన్నా షాట్ నచ్చకపోతే మొహమాటం లేకుండా రీటేక్ చేద్దామని చెప్పేది.... అని రాజశేఖర్ చెప్పారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM