'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్

by సూర్య | Tue, May 17, 2022, 09:46 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. వేసవి లో ప్రేక్షకులను ఉల్లాసపరచటానికి మే 27న ఈ చిత్రం విడుదల కానుంది. తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాడా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, సోనాల్ చౌహన్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. DSP మ్యూజిక్ డైరెక్షన్లో విడుదలైన లబ్ డబ్ డబ్బో, ఊఁ ఆఁ ఆహా ఆహా పాటలు మంచి ఆదరణ పొందాయి.


తాజాగా ఈ మూవీ నుండి పూజాహెగ్డే ఐటెం సాంగ్  లిరికల్ వెర్షన్ రిలీజయ్యింది. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అని సాగే ఈ సాంగ్ లో  వెంకటేష్, వరుణ్ లతో కలిసి పూజా వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యమందించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతామాధురి ఆలపించారు.  జిగేలుమనే భారీస్ సెట్స్ లో, నటీనటుల కలర్ ఫుల్ ఔట్ ఫిట్ లతో ఈ సాంగ్ పార్టీ మూడ్ ను తీసుకొస్తుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
పృథ్విరాజ్ "కడువా" సెన్సార్ పూర్తి ..! Wed, Jul 06, 2022, 02:34 PM
యూట్యూబులో ట్రెండ్ అవుతున్నఫేర్ వెల్ సాంగ్ Wed, Jul 06, 2022, 01:39 PM
ఆ వార్తల పై స్పందించిన హీరోయిన్ Wed, Jul 06, 2022, 01:36 PM
నేడు 'డ్రైవర్ జమున' ట్రైలర్ Wed, Jul 06, 2022, 01:31 PM
సినీనటుడు విజయ్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట Wed, Jul 06, 2022, 01:27 PM