'థిస్ ఆర్ థాట్' ఛాలెంజ్‌ని స్వీకరించిన అంటే సుందరానికి లీడ్ పెయిర్

by సూర్య | Sat, May 14, 2022, 01:49 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం "అంటే సుందరానికి" అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ లీడ్ పెయిర్ సినిమాకు సంబంధించిన 'థిస్ ఆర్ థాట్' అనే ఛాలెంజ్‌ని స్వీకరించారు. ఈ ఛాలెంజ్ వీడియో చాలా ఫన్నీగా అందరిని ఆకట్టుకుంటుంది. ఇంటర్నెట్ లో విడుదల చేసిన తక్కువ టైమ్ లోనే ఈ వీడియో ఫుల్ వైరల్‌గా మారింది. ఈ రోమ్-కామ్ సినిమాని మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా జూన్ 10, 2022న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ వెల్లడించారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM