విడుదల తేదీని ఖరారు చేసిన రాజ్‌కుమార్ రావు 'హిట్'

by సూర్య | Sat, May 14, 2022, 01:47 PM

శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'హిట్-ది ఫస్ట్ కేస్' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిందీలో కూడా అదే టైటిల్‌తో రీమేక్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించారు. గ్లామర్ బ్యూటీ సన్యా మల్హోత్రా ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావుకి జంటగా నటించారు. ఈ రీమేక్‌కు కూడా శైలేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలను ప్రకటించారు. ఈ చిత్రం జూన్ 15,2022న విడుదల కానుంది అని మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా  ప్రకటించారు. ఈ చిత్రంలో రోహన్ సింగ్, షాను కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రాఫర్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, భూషణ్ కుమార్ మరియు కులదీప్ రాథోడ్ నిర్మించారు. ఈ చిత్రానికి మనన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM