'కృష్ణ బృందా విహారి' విడుదల వాయిదా పడిందా?

by సూర్య | Sat, May 14, 2022, 01:43 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య 'కృష్ణ బృందా విహారి' అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన షిర్లీ సెటియా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది అని సమాచారం. మే 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది మూవీ మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా మళ్లీ వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. మే 27న 'ఎఫ్ 3' సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని మళ్లీ వాయిదా వేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM