ఆ ఒక్క సీన్ కోసం...సమరసింహారెడ్డినే వదులుకొందటా

by సూర్య | Fri, Jan 14, 2022, 09:25 PM

ఏదైనా లక్ ఉండాలంటారు. అన్నీ అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం అన్న బాధ సినీతారాలు వ్యక్తంచేయడం సహజం. అలాంటిదే రాశీ జీవితంలో ఒక్కటుంది. టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సమరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోతుంది. 1999 సంక్రాంతి సీజన్ లో వచ్చి దుమ్ముదులిపేసింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం, బాలయ్య నటనా విశ్వరూపం, బి.గోపాల్ డైరెక్షన్ ప్రతిభతో ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేసిందంటే ఏ రేంజిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో కొన్ని థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది. ఈ చిత్రంలో సిమ్రాన్, సంఘవి, అంజలా జవేరి నటించారు. ఇదిలావుంటే సిమ్రాన్ నటించిన పాత్రకు తొలుత రాశిని అనుకున్నారట. అయితే ఆ సినిమాలో ఓ సీన్ నచ్చకపోవడంతో రాశి అంత పెద్ద చిత్రాన్ని వదులుకుంది. అందులో హీరోయిన్ తో సీతాకోకచిలుక సీన్ ఉంటుంది. ఆ సీన్ పట్ల రాశి అభ్యంతరం వ్యక్తం చేయడంతో, సిమ్రాన్ వైపు మొగ్గారట.

Latest News
 
పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన హీరోయిన్ శ్రీలీల Fri, May 10, 2024, 10:58 PM
234 నియోజకవర్గాల్లో 10,12వ తరగతి విద్యార్థులకు బహుమతులు అందజేయనున్న దళపతి విజయ్ Fri, May 10, 2024, 10:44 PM
'టర్బో' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Fri, May 10, 2024, 07:28 PM
'ఓ మంచి ఘోస్ట్' టీజర్ అవుట్ Fri, May 10, 2024, 07:25 PM
OTT అరంగేట్రం చేసిన 8 A.M. మెట్రో Fri, May 10, 2024, 06:12 PM