బాలివుడ్ పై సుకుమార్ కన్ను

by సూర్య | Fri, Jan 14, 2022, 09:26 PM

తెలుగులో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకొన్న సుకుమార్ ఇపుడు బాలివుడ్ పై నజర్ పెట్టనున్నట్లు తెలిసింది. దీని వెనక ఓ పెద్ద కథ కూడా ఉంది లేండి. విభిన్నమైన కథాకథనాలను .. నేపథ్యాలను ఎంచుకుంటూ సుకుమార్ వెళుతున్నాడు. ఎన్టీఆర్ .. చరణ్ ... అల్లు అర్జున్ సినిమాలతో ఆయన హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు. 'పుష్ప' సినిమా రికార్డుస్థాయి వసూళ్లతో దర్శకుడిగా ఆయన సత్తాను చాటింది. ఈ సినిమా సెకండ్ పార్ట్ కి సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఒక ఆసక్తికర్తమైన విషయం చెప్పాడు. బాలీవుడ్ లో ఫలానా హీరోతో సినిమా చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నేను 'పుష్ప' షూటింగులో ఉండగా అక్షయ్ కుమార్ కాల్ చేసి, తనతో ఒక సినిమా చేయాలని చెప్పి కలవమన్నారు. అందువలన ఆయనతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు. 'పుష్ప 2' తరువాత చరణ్ తో సుకుమార్ సినిమా ఉండనుంది. ఆ తరువాత సినిమాను ఆయన విజయ్ దేవరకొండతో చేయవలసి ఉంది. మరి ఈ రెండు సినిమాల తరువాత అక్షయ్ కుమార్ తో చేస్తాడో, లేదంటే ఈ రెండు సినిమాల మధ్యలో ముంబై వెళ్లి వస్తాడో చూడాలి. మొత్తానికైతే సుకుమార్ - అక్షయ్ కుమార్ కాంబో అయితే ఖరారైపోయినట్టే.

Latest News
 
"కళాపురం" నుండి 'నీలో ఉన్నా' సాంగ్ రిలీజ్  Wed, Aug 17, 2022, 06:40 PM
లూసిఫర్ 2 స్క్రిప్ట్ లాక్డ్ ... పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ..! Wed, Aug 17, 2022, 06:34 PM
PS 1 నుండి సెకండ్ లిరికల్ అప్డేట్ Wed, Aug 17, 2022, 06:22 PM
మరొక పాన్ ఇండియా ప్రాజెక్టుతో రాబోతున్న రాజమౌళి తండ్రి Wed, Aug 17, 2022, 06:15 PM
ఆస్కార్ బరిలో నాని "శ్యామ్ సింగరాయ్"...!! Wed, Aug 17, 2022, 06:01 PM