“పుష్ప” ఓటిటి హిందీ వెర్షన్ వచ్చేసింది.!

by సూర్య | Fri, Jan 14, 2022, 03:24 PM

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో తెచ్చుకుంది. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాజిల్, ధనంజయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం థియేట్రికల్ గా సేఫ్ అయ్యాక ఓటిటి లో రిలీజ్ అయ్యి మరింత స్థాయి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే సౌత్ ఇండియన్ భాషల్లో తొలిసారిగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైన ఈ సినిమా హిందీ వెర్షన్ ఈరోజు నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో కూడా ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అందుకే ఈ సినిమా అసలు హిందీలో ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరికి ఈ వెర్షన్ కూడా వచ్చింది. మరి వ్యూయర్ షిప్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Latest News
 
ఆస్కార్ బరిలో నాని "శ్యామ్ సింగరాయ్"...!! Wed, Aug 17, 2022, 06:01 PM
కొమురం భీముడో సాంగ్ పై రాజమౌళి ఇంటరెస్టింగ్ కామెంట్స్ Wed, Aug 17, 2022, 05:44 PM
ఈవారంలోనే రానున్న "కార్తికేయ 2" OST Wed, Aug 17, 2022, 05:32 PM
మహేష్, తారక్ లమధ్య ఈ పోలిక గమనించారా? Wed, Aug 17, 2022, 05:13 PM
'సీత రామం' 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Aug 17, 2022, 05:00 PM