ఆ కారణంగానే మిమ్మల్ని పిలువలేదు... క్షమించండి

by సూర్య | Wed, Jan 12, 2022, 09:03 PM

కరోనా కారణంగానే అఖండ సక్సెస్ మీట్ కు మిమ్మల్ని పిలవలేదని బాలకృష్ణ అభిమానులకు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ క్షమాపణ చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, బోయపాటి, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ, అభిమానులను ఈ ఈవెంట్ కు పిలవలేకపోయినందుకు క్షమించాలని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమయిందని... సక్సెస్ మీట్ కు రమ్మంటే అభిమానులు ఏమాత్రం ఆలోచించకుండా వచ్చేస్తారని, వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఈవెంట్ కు పిలవలేదని చెప్పారు. ఫ్యాన్స్ బాగుండాలనే వారిని పిలవలేదని అన్నారు. ఈవెంట్ కు పిలవనందుకు తమను క్షమించాలని కోరారు.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM