ఇద్దరి మంచి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాం

by సూర్య | Wed, Jan 12, 2022, 09:01 PM

ఇరువురి మంచి కోసమే తాను సమంత విడిపోయామని హీరో నాగచైతన్య పేర్కొన్నారు. బంగార్రాజు చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగ చైతన్య మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన విషయాలే కాకుండా పర్సనల్ విషయాలను మీద కూడా రియాక్ట్ అయ్యాడు. మొదటి సారిగా నాగ చైతన్య విడాకుల మీద స్పందించాడు. అది కూడా బంగార్రాజు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయం మీద నోరు విప్పాడు. ఇద్దరి మంచి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాం.. ఆమె హ్యాపీగా ఉంది నేను హ్యాపీగా ఉన్నామని నాగ చైతన్య విడాకుల అంశం మీద స్పందించాడు. ఇక నాగార్జున బంగార్రాజు సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ టికెట్ రేట్ల అంశం మీద స్పందించిన తీరు ఎంతలా వివాదాస్పదంగా మారిందో అందరికీ తెలిసిందే. తగ్గించిన టికెట్ రేట్లకు తనకు ఎలాంటి నష్టం లేదని, తన సినిమాకు వచ్చిన నష్టమేమీ లేదని కుండ బద్దలు కొట్టేసినట్టు నాగార్జున క్లియర్‌గా చెప్పాడు. అయితే నాగ్ ఎందుకు అలా అన్నాడో నాగ చైతన్య మాటలను పట్టి అర్థం చేసుకోవచ్చు. టికెట్ రేట్ల తగ్గింపుకు సంబంధించిన జీవో ఏప్రిల్‌లో వచ్చింది.. ఆగస్ట్‌‌లో నేను, నాన్నా ఈ విషయం గురించి చర్చించుకుని తగ్గించిన టికెట్ రేట్లకు అనుగుణంగానే ఆ బడ్జెట్‌లోనే ఈ సినిమాను నిర్మించాం. ఒకవేళ టికెట్ రేట్లు ఇప్పుడు పెంచితే అది మాకు బోనస్‌లా ఉంటుందని నాగ చైతన్య క్లియర్‌గా చెప్పేశాడు. మొత్తానికి బంగార్రాజు సినిమాను తగ్గించిన టికెట్ రేట్లకు అనుగుణంగానే తెరకెక్కించినట్టు చెప్పేశాడు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM