టాలీవుడ్ కు అరంగేట్రం చేయనున్న జాన్వీ కపూర్

by సూర్య | Tue, Nov 23, 2021, 03:02 PM

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్లలో ఒకరు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టిపడేసింది జాన్వి.చేసింది తక్కువ సినిమాలే అయినా జాన్వికి భారీగా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా బిజీగా గడిపేస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ అమ్మడు టాలీవుడ్ అరంగేట్రం చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో కృష్ణ వంశీ దర్శకత్వంలో జాన్వికపూర్ ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వచ్చింది. కానీ అందుకు సంబంధించిన ఏ విషయాలు తెలియరాలేదు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ .. జాన్విని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ ఏలాంటి సమాచారం రాలేదు.


ఇదిలా ఉంటే.. తాజాగా జాన్వీ తెలుగు సినిమాకు అప్డేట్ వినిపిస్తుంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో జాన్వీ హీరోయిన్ గా చేయబోతుందని టాక్. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో ముందుగా శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా వార్తలు రాగా.. ఇప్పుడు జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే జాన్వీతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ .. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM