బిగ్‌బాస్‌ హౌస్ నుంచి అనీ మాస్టర్‌ ఎలిమినేట్‌

by సూర్య | Mon, Nov 22, 2021, 08:34 AM

బిగ్‌బాస్‌ సీజన్‌-5 నుంచి అనీ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో చివరిగా అనీ మాస్టర్‌, ప్రియాంకలు డేంజర్ జోన్ లో ఉండగా అతి తక్కువ ఓట్లు వచ్చిన అనీ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యారు. డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా, టెలివిజన్‌ షోలలో జడ్జిగా అనీ మాస్టర్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సెప్టెంబరు 5న మొదలైన బిగ్‌బాస్‌ షోలో ఐదో కంటెస్టెంట్‌గా అనీ హౌస్‌లోకి అడుగుపెట్టారు. హౌస్‌లోకి వెళ్లిన మొదట్లో అనీ మాస్టర్‌ అందరినీతోనూ కలివిడిగా ఉండేవారు. రోజులు గడిచే కొద్దీ ఆమె ప్రతి దానికీ అసహనం వ్యక్తం చేసేవారు. మగవాళ్లు బలమైన కంటెస్టెంట్‌లు అని, వాళ్లు ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ ఎక్కువగా వాళ్లనే నామినేట్‌ చేసేవారు. తన గేమ్‌కు ఎవరైనా అడ్డుపడితే గట్టిగా అరిచేసేవారు. ‘గ్రూప్‌’గా ఆడటం వల్లే తాను ఓడిపోయానని, కావాలని ఓడించారని మండిపడేవారు. 10 వారంలో ఆమె హౌస్ కెప్టెన్‌ అయ్యారు. హౌస్ లో ఆమె ఎంతో ఓర్పుతో ఇంటి సభ్యులందరికీ వండి పెట్టేవారు. తొలుత సన్నీ, శ్వేతలతో మంచి స్నేహంగా ఉండేవారు. సన్నీ తన కొడుకులాంటి వాడని, శ్వేత కూతురంటూ ఆప్యాయంగా పిలిచేవారు. కాజల్‌ను శత్రువుగా చూసేవారు. ఆమె ఏ చిన్న పని చేసినా తప్పు పట్టేవారు. కాజల్‌ పై గట్టిగట్టిగా అరిచేసేవారు. వెక్కిరించడం, హేళనగా మాట్లాడుతూ డ్యాన్స్‌ చేసేవారు. ‘ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌’ విషయంలోనూ కాజల్‌ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఈ విషయంలో నాగార్జున సైతం అనీ మాస్టర్‌ ను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి చురకలు అంటించారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM