నాగబాబు పై ట్రోలింగ్

by సూర్య | Mon, Oct 25, 2021, 11:32 AM

టీ 20 వరల్డ్‌ కప్‌ మొదటి మ్యాచ్‌ లోనే టీమిండియా ఘోర పరాజయం పాలైంది. అందులోనూ దయాది పాక్‌ స్థాన్‌ జట్టు పై టీమిండియా ఓడిపోవడంతో… క్రికెట్‌ లవర్స్‌ ఆందోళన చెందుతున్నారు. అయితే.. టీమిండియా ఓటమి సెగ మెగా బ్రదర్‌ నాగబాబు కు కూడా తాకింది. మెగా బద్రర్‌ నాగబాబను సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.నిన్న ఇండియా మరియు పాకిస్థాన్ మ్యాచ్‌ చూసేందుకు నాగబాబు స్టేడియానికి వెళ్లడమే ఇందుకు కారణం. భారత్‌ ఓడిపోవడంతో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ” ఎక్కడ లెగ్గు పెడితే అక్కడే ఓటమే” అంటూ మీమ్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. ప్రజా రాజ్యంలో చిరంజీవి, జనసేన పార్టీ లో పవన్‌ కళ్యాణ్‌, మా అర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ను ఇలా ఎవరికి సపోర్ట్ చేసినా.. ఓడిపోతున్నారని ట్వీట్లు చేస్తున్నారు. కాగా.. నిన్న భారత్‌ మరియు పాక్‌ మ్యాచ్‌ కోసం నాగ బాబు మరియు వరుణ్‌ తేజ్‌ దుబాయ్‌ వెళ్లారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM