ఎఫ్3లో కీలక పాత్రలో కనిపించనున్న సోనాల్ చౌహన్

by సూర్య | Fri, Oct 22, 2021, 12:34 PM

ఎఫ్2తో కామెడీ కొత్త పుంతలు తొక్కించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తోన్న విషయం తెల్సిందే. డబల్ ఫన్ పేరిట అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్ గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు కనిపించబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఈసారి సునీల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరుగుతోంది.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ కీలక పాత్రలో నటించింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలియజేసింది. ఆమె ఫోటోను షేర్ చేస్తూ, 'ఎఫ్3 వంటి మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది' అని తెలియజేసింది సోనాల్.


2019లో రూలర్ లో నటించిన తర్వాత మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు సోనాల్. ఇది ఆమెకు మళ్ళీ కంబ్యాక్ వంటిది. పూర్తి స్థాయి కామెడీతో ఎఫ్3ను రూపొందిస్తున్నట్లు అనిల్ రావిపూడి చెబుతున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. డిసెంబర్ కల్లా ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు.



 

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM