జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాట్ గా ఫోజ్ ఇస్తున్న' పానీ పానీ' వీడియో సాంగ్ !

by సూర్య | Fri, Jun 11, 2021, 03:43 PM

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో తన హవా కంటిన్యూ చేస్తోంది. ఎల్లప్పుడూ  సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే జాక్వెలిన్ తాజాగా మరో ప్రైవేట్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే తాజాగా బాద్షాతో కలిసి 'పానీ పానీ' అనే సరికొత్త పాటతో ముందుకు వచ్చింది. గెండాపూల్ కోసం బెంగాలీ అవతారంలో కనిపించిన జాక్వెలిన్.. ఈసారి పానీపానీ పాటలో రెడ్ అండ్ వైట్ సారీతో పాటు ఆభరణాలు అందమైన మేకప్తో సంప్రదాయ రాజస్థాని రూపంలో అలరిస్తుంది. బాద్షా - ఆస్తా గిల్ కలిసి పాడిన ఈ రాజస్థాని స్టైల్ సాంగ్ ఇటువలే రిలీజ్ అయింది. ఈ పెప్పి ట్రాక్ మ్యూజిక్ వీడియోను రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో షూట్ చేశారు. అయితే ఈ సాంగ్ లిరిక్స్ తో పాటు మ్యూజిక్ కూడా బాద్షానే ఇవ్వడం విశేషం. తాజాగా జాక్వెలిన్ ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ.. "బాద్షా పానీపానీ సాంగ్ విషయంలో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వెంటనే ఓకే చెప్పను. ఎందుకంటే ట్రాక్ వింటే ఖచ్చితంగా బాగా కనెక్ట్ అవుతుందని అనిపించింది. ఈ పాటలో మీరు డిఫరెంట్ జాక్వెలిన్ అవతారం చూస్తారు. అద్భుతమైన ఎడారి.. ప్రకృతి అందాల మధ్య ఈ సాంగ్ షూట్ చేసాం." అని చెప్పుకొచ్చింది.అయితే తాజాగా జాక్వెలిన్ తన ఇంస్టా ఖాతాలో పానీపానీ సాంగ్ మేకింగ్ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో మనం డిఫరెంట్ రాజస్థాని గెటప్స్ లో జాక్ బ్యూటీని చూడవచ్చు. ఈ ముప్పైఐదేళ్లు పైబడిన గ్లామరస్ బ్యూటీ పానీ పానీ అంటూ అందరి మనసులు దోచుకుంటుంది. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM