ఖిలాడీ మూవీ రీమేక్ చేయనున్న సల్మాన్ ఖాన్ !

by సూర్య | Fri, Jun 11, 2021, 03:24 PM

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రాన్ని బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయబోతున్నాడని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్ ఖాన్ కు సౌత్ సినిమాలు రీమేక్ చేయడం కొత్తేమి కాదు. తేరే నామ్ నుండి మొదలుపెట్టి ఎన్నో చిత్రాలను రీమేక్ చేసి విజయాలు అందుకున్నాడు.గతంలో రవితేజ నటించిన కిక్ చిత్రంతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన సల్మాన్ ఖాన్, ఇప్పుడు మరోసారి మాస్ మహారాజా సినిమానే రీమేక్ చేయబోతున్నాడు. రవితేజ నటిస్తోన్న ఖిలాడీ టీజర్ చూసి ఇంప్రెస్ అయిన సల్మాన్ ఖాన్, స్టోరీ తెలుసుకున్నాడు.అది కూడా నచ్చడంతో చిత్రాన్ని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. తెలుగులో సినిమాను డైరెక్ట్ చేసిన రమేష్ వర్మకే దర్శకత్వం వహించే అవకాశమిస్తానని ఆఫర్ చేసాడట కూడా. తెలుగులో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

Latest News
 
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Mar 28, 2024, 03:18 PM
'గేమ్ ఛేంజర్' విడుదల అప్పుడేనా? Thu, Mar 28, 2024, 03:16 PM
'బడే మియాన్ చోటే మియాన్‌' తెలుగు వెర్షన్ ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:15 PM
శాటిలైట్ భాగస్వామిని లాక్ చేసిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 03:12 PM
'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:11 PM