బాడీషేమింగ్ చేసిన నెటిజన్స్

by సూర్య | Sat, Jun 12, 2021, 09:57 AM

బాలనటిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మలయాళ బ్యూటీ సనూష. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం మూవీతో తెలుగు తెరకు పరిచమైన సనూష.. ఆ తర్వాత తెలుగులో వరూస ఆఫర్లను అందుకుంది. రేణిగుంట, జీనియస్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి#8230; తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హీరో నాని నటించిన జెర్సీ సినిమాలో జర్నలిస్టు పాత్రలో కనిపించింది సనూష. అయితే చిన్పప్పటి నుంచి కాస్తా బొద్దుగా ఉండే సనూష..ఈ మధ్య ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టి నాజుగ్గా మారిపోయింది. ఈ క్రమంలోనే.. ఇటీవల తన ఫోటో షూట్‏కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇంకేముందు నెటిజన్లు ఊరుకుంటారా ? ఆమె శరీరాకృతిపై విమర్శలు చేస్తూ.. అసభ్యంగా పోస్టులు పెట్టారు. వీటిని చూసిన సనూష.. నెటిజన్ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


నన్ను అనేముందు మీరెంటో తెలుసుకోండి.. మీరెం పర్ ఫెక్ట్ కాదంటూ తనపై నెగిటివ్స్ కామెంట్స్ చేసిన వారికి ఘాటుగానే సమాధానం చెప్పింది సనూష. #8220;నా శరీర బరువు గురించి నాకంటే ఎక్కువగా బాధపడుతున్న వారందరికి నేను చెప్పేది ఒకటే. ఎదుటి వాళ్ల వైపు వేలెత్తి చూపిస్తే.. మిగిలిన వేళ్లు మిమ్మల్ని చూపిస్తాయని గుర్తుపెట్టుకొండి. కాబట్టి ఎదుటి వాళ్లను అనేముందు ఒక్కసారి మీరెంత పర్ ఫెక్ట్ గా ఉన్నారో ఆలోచించుకోండి #8221; అంటూ విమర్శకులకు గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM