సింపుల్ పోస్టర్ తో సరిపెట్టుకున్న అఖండ మూవీ!

by సూర్య | Fri, Jun 11, 2021, 03:04 PM

సింహ, లెజెండ్ హిట్స్ తరువాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మరో సెన్సేషనల్ మూవీ అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయన్‌గా పూర్ణ కీలకపాత్రలో కన్పించనున్నారు. ఇప్పుడు బాలయ్య 61వ పుట్టిన రోజు సందర్భంగా అంటే జూన్ 10 వ తేదీన బాలయ్య అభిమానులు సందడి చేసుకోనున్నారు. కొద్దిరోజులుగా ఎదురు చూస్తున్న అఖండ మూవీ పోస్టర్ బాలయ్య బర్త్‌డే గిఫ్ట్‌గా ఒకరోజు ముందుగానే విడుదలైంది. బాలయ్యకు బర్త్‌డే విషెత్ చెబుతూ నిర్మాతలు ఈ పోస్టర్ విడుదల చేశారు. ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ లాంటిది ఏమన్నా ఉంటుందేమో ఆశించగా మొత్తానికి అవేమి లేకుండానే మేకర్స్ ముగించేశారు. మరి ఇవన్నీ మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM