పెళ్లి తరువాత లీడ్ రోల్ లో కాజల్ అగ్గార్వాల్ మూవీ?

by సూర్య | Fri, Jun 04, 2021, 02:48 PM

తెలుగు తమిళంలో అగ్ర హీరోల సరసన నటిస్తూ ఇప్పటికీ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్యలో నటిస్తున్న కాజల్ భారతీయుడు 2లోనూ కథానాయిక. నాగార్జున-ప్రవీణ్ సత్తారు చిత్రంలోనూ కాజల్ నాయిక. ఇతర చిత్రాలతోనూ కెరీర్ పరంగా బిజీగా ఉంది.


తాజాగా చందమామ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సంతకం చేశారు. తధాగతట సింఘ దర్శకత్వంలో `ఉమ` అనే చిత్రంలో లీడ్ పాత్రను పోషిస్తోంది. ఇది పెళ్లి నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామా కథాంశంతో తెరకెక్కనుంది. పూర్వీకులకు చెందిన పాత కాలం ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఒక అపరిచితురాలైన ఉమా రాకతో ఇంట్లో ఎలాంటి ట్విస్టు బయటపడింది? అన్నది తెరపై చూడాల్సిందే.మిగతా స్టార్ హీరోయిన్లతో పోలిస్తే చాలా లేటుగా ‘లేడీ ఓరియెంటెడ్’ సినిమాల లీగ్‌లోకి వచ్చింది కాజల్ అగర్వాల్. రెండేళ్ల కిందట ఆమె తన గాడ్‌ఫాదర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీత’లో లీడ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అందులో కాజల్ అందం, అభినయం రెండింట్లోనూ ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా అయితే సరిగా ఆడలేదు. అయినప్పటికీ కాజల్ ఏమీ వెనక్కి తగ్గలేదు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైవ్ టెలికాస్ట్’ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేసింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోనూ లీడ్ రోల్స్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.


కాజల్ ప్రధాన పాత్రలో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రాబోతుండటం విశేషం. ఇందులో ఒకటి ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ తెరకెక్కించబోతున్నాడు. ఆ సినిమా గురించి ప్రకటన రావాల్సి ఉంది. ఈ లోపు కాజల్ లీడ్ రోల్‌లో ‘ఉమ’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. తథాగత సింఘా అనే యాడ్ ఫిలిం మేకర్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. అవిషేక్ ఘోష్, మంత్రరాజ్ పలివాల్‌ల ఆధ్వర్యంలోని మిరాజ్ గ్రూప్ అనే కార్పొరేట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుండటం విశేషం. ఇది ‘క్వీన్’ తరహా చిత్రమట. పాన్ ఇండియా లెవెల్లో దీన్ని తెరకెక్కించనున్నారు

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM