మూవీ రివ్యూ: వకీల్ సాబ్

by సూర్య | Fri, Apr 09, 2021, 01:17 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మూడేళ్ల తర్వాత వచ్చిన వకీల్ సాబ్ థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఇన్నాళ్లు పవన్ ను మిస్ అయిన అభిమానులకు ఇదో పండగ రోజు. గత రాత్రి విదేశాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. సినిమాపై అక్కడి ఆడియన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వకీల్ సాబ్ వాదన కథను ఊహించని మలుపు తిప్పుతుందని తెలుస్తోంది. మరి వకీల్ సాబ్ ఎలా ఉన్నాడు.


పొలిటికల్ ఎంట్రీ తర్వాత సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తుండటం, అందులోనూ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ పింక్‌ రీమేక్ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అమితాబ్ పోషించిన పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయారని ట్విట్స్ వస్తున్నాయి. పవర్ స్టార్ కెమెరా ముందు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్‌మెన్స్ ఇచ్చారని, కోర్టు సీన్స్‌లో ఇరగదీశారని ఫ్యాన్స్ చెబుతున్నారు. వేణు శ్రీరామ్ కథను నేరేట్ చేసిన ఎక్స్ ట్రార్డినరీ ఉందని చెబుతున్నారు. కథ మూలాలను దెబ్బతినకుండా చిన్న చిన్న కమర్షియల్ అంశాలను యాడ్ చేసిన తీరు అందరికి నచ్చుతుంది. తాగుబోతు లాయర్ గా.. అన్యాయం జరిగితే ఎదురుతిరిగే వ్యక్తిగా పవన్ నటన అదుర్స్. ఫస్టాఫ్ స్లోగా మొదలై సెకండాఫ్ కు వచ్చే సరికి ప్రతి సీన్ దద్దరిల్లుతుంది.


నటీనటులు: సత్యదేవ్ పాత్రలో పవన్ తన పాత్రకు ప్రాణం పోశాడు. ఆలోచింప చేసే డైలాగ్ లతో అదరగొట్టాడు. ఇక శృతి హాసన్ చిన్న పాత్రలో మెరిసింది. నంద పాత్రలో ప్రకాశ్ రాజు నటన బాగుంది. ముగ్గురు అమ్మాయిల్లో నివేదా థామస్ చాలా బాగా నటించింది. అంజలి, అనన్య కూడా పర్లేదు.


టెక్నికల్ టీం: ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ థమన్ సంగీతం. ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నిలబెట్టింది. పాటలు కూడా బాగున్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ పర్లేదు అనిపించింది. ఫస్టాఫ్ చాలా వరకు సన్నివేశాలు బోర్ కొట్టించాయి. సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది. కోర్టు సీన్స్ నెవర్ బిఫోర్ అన్నట్లు గా దర్శకుడు తెరకెక్కించాడు.


 నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతిహాసన్, నివేద థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు.., ఎడిటర్: నవీన్ నూలీ, సంగీతం: తమన్, రచన, దర్శకత్వం: శ్రీరామ్ వేణు, నిర్మాతలు: రాజు, శిరీష్. 


రేటింగ్: 3.5/5

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM