గోవా బ్యూటీకి బాలీవుడ్‌లో క్రేజ్ తగ్గలేదు..!

by సూర్య | Tue, Apr 06, 2021, 12:53 PM

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగినిది. యూత్‌లో ఇలియానకి ఎంత క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే. బెల్లీ డాన్స్‌తో కుర్రాళ్ళకి హీట్ పెంచింది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'దేవదాసు' సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ సినిమాలో ఇలియానా పర్ఫార్మెన్స్ పరంగానే కాకుండా గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో కూడాబాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొంది ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసిన 'పోకిరి' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీని తెచ్చుకుంది.


టాలీవుడ్‌లో అతికొద్ది కాలంలోనే కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గా హాట్ టాపిక్ అయింది ఇలియానా. మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, రవితేజ, రానా, అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్స్‌తో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఒక్కసారిగా ఇలియా కెరీర్ డౌన్ ఫాల్ అవడంతో ఇక సినిమా కెరీర్ క్లోజ్ అని మాట్లాడుకున్నారు. కానీ అనుకోకుండా మాస్ మహారాజ రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇలియానా రీ ఎంట్రీకి ఈ సినిమా ఏమాత్రం కలిసి రాలేదు. అయితే బాలీవుడ్‌లో మాత్రం సినిమా తర్వాత సినిమా చేస్తూ బాగానే ఫాంలో ఉంది. త్వరలో అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించిన 'ది బిగ్ బుల్' సినిమాతో రాబోతోంది ఇలియానా. అలాగే రణదీప్ హుడాతో 'అన్ ఫెయిర్ & లవ్లీ' సినిమాలో నటిస్తోంది. ఇక ఆ మధ్య టాలీవుడ్ కింగ్ నాగార్జున బాలీవుడ్ హిట్ సినిమా 'రైడ్' తెలుగు రీమేక్‌లో నటించబోతున్నాడని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇలియానా నటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. కానీ ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ మాత్రం రాలేదు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'శివాజీ' Fri, Apr 26, 2024, 02:24 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM