ఆ బాధను భరించడం చాలా కష్టం: అంజలి

by సూర్య | Tue, Apr 06, 2021, 01:21 PM

హీరోయిన్ అంజలి తెలుగులోని స్టార్‌ హీరోల సరసన నటించింది. ప్రస్తుతం ఇతర భాషా సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. 'నిశ్శబ్దం' తర్వాత అంజలి తెలుగులో నటించిన సినిమా 'వకీల్‌ సాబ్'‌. ఈ సినిమా ప్రమోషన్ ‌లో పాల్గొన్న ఆమె ప్రేమ, పెళ్లి గురించి స్పందించింది. కొన్నాళ్ల క్రితం తాను ప్రేమలో పడిన విషయం నిజమేనని అంగీకరిస్తూనే కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ అయినంత మాత్రాన తన మనసేమీ బండరాయి కాదని, ప్రేమ విఫలమైన బాధను భరించడం చాలా కష్టమని తెలిపింది. తన తల్లి వల్లే అలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడ్డానని చెప్పింది. పెళ్లి గురించి ఇప్పట్లో ఏమీ ఆలోచించడం లేదని స్పష్టం చేసింది.

Latest News
 
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM