‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్‏ప్రైజ్

by సూర్య | Tue, Mar 30, 2021, 03:54 PM

‘ఆర్ఆర్ఆర్’ మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా.. వీరికి జోడీలుగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక అక్టోబర్ 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించింది చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా పాత్రలను పరిచయం చేశాడు జక్కన్న. తాజాగా అభిమానులకు మరో సర్‏ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 2న అజయ్ దేవగణ్ పుట్టిన రోజు కావడంతో ఆరోజున అజయ్ ఫస్ట్ లుక్‏తోపాటు మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అజయ్ దేవ్‏గణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఈ చిత్రం నాకొక ఉత్తేజకరమైన అనుభవాన్నిచ్చింది. ఇందులో రాజమౌళి సృష్టించిన నా పాత్రను మీకు పరిచయం చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అంటూ వెల్లడించారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు గురువుగా, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇక ఇందులో సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM