చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగకుండా రక్షణ వలయంగా నిలవాలి : త్రిష

by సూర్య | Wed, Oct 14, 2020, 04:15 PM

చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిరోధించేందుకు అందరూ కృషి చేయాలని యూనిసెఫ్‌ బాలల హక్కుల సంఘం రాయబారి, అందాలనటి త్రిష పిలుపునిచ్చారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువతీ యువకులతో జూమ్‌ యాప్‌ ద్వారా త్రిష మాట్లాడారు. బాల్యవివాహాల వలన కలిగే అనర్థాలను గురించి ప్రజలలో అవగాహన కలిగేలా ప్రచారం చేయాలని, చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగకుండా రక్షణ వలయంగా నిలవాలని ఆమె కోరారు. పసివాడని చిన్నారులపై ఇటీవలకాలంలో అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఎక్కడా చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగకుండా స్వచ్చంద సంస్థలు, వలంటీర్లు తీవ్రంగా కృషి చేయాలని, నేరస్థులకు శిక్షపడేలా చేయాలని త్రిష విజ్ఞప్తి చేశారు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM