కొత్త చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

by సూర్య | Fri, Oct 09, 2020, 05:43 PM

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ తమ పదవ చిత్రాన్ని శుక్రవారం ప్రకటించబోతున్నట్లుగా గురువారం సోషల్‌ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లే ఆ సంస్థ శుక్రవారం కొత్త చిత్రాన్ని ప్రకటించారు. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధ శ్రీనాధ్ నాయికగా ఈ చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ ఇంతకుముందు 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ  చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తోంది. 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రానికి టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రానికి 'నరుడి బ్రతుకు నటన' అనే పేరును ఖరారు చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు.


ఇక ఈ ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే.. సంగీతానికి ఈ చిత్రకథకు సంబంధం ఉందన్నట్లు హెడ్ ఫోన్స్, హృదయం రూపంలో ఓ జంట లోకాన్ని మరచిపోయి దగ్గరగా ఉండటం చూస్తే.. ఇది ప్రేమ కథా చిత్రమా అనిపిస్తుంది. సహజంగా హార్ట్ సింబల్ రెడ్ కలర్‌లో ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఇది బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. ఇలా ఎందుకు? ప్రేమ కథకుమించి ఈ చిత్రంలో ఇంకేదో ఉంది అనిపిస్తుంది. అదేమిటో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM