'టక్ జగదీష్ ' షూటింగ్ షురూ..

by సూర్య | Thu, Oct 08, 2020, 11:34 AM

న్యాచురల్ స్టార్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. చిరంజీవి తర్వాత అంతగా కష్టపడి పైకొచ్చాడు. రేడియో జాకీ గా కెరీర్ ను మొదలు పెట్టిన నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆతర్వాత ఒక్కోశాఖలో పనిచేస్తూ పేరు ప్రఖ్యాతలు పొందాడు. అష్టాచమ్మా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు.ఆ సినిమా తో మంచి టాక్ ను అందుకున్నాడు..
ఆ తర్వాత ఒక్కో సినిమాతో ఒక్కో విధంగా పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు..జెర్సీ సినిమా నుంచి నాని మాంచి ఊపు మీద ఉన్నాడు..వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇటీవల విడుదలైన వి సినిమాలో నాని విలన్ పాత్రలో కనిపించాడు..అయితే ఓటీటి లో విడుదల అయిన ఈ సినిమా.. ఓ మాదిరిగా పర్వాలేదనే టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం నిన్ను కోరి డైరెక్టర్ శివ నిర్వాణ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది.టక్ జగదీష్ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఖరారు చేసారు.
లాక్ డౌన్ కు ముందు ఈ సినిమాను మొదలు పెట్టారు..అయితే కరోనా పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ తో పాటు నాని కూడా ట్వీట్ చేశారు.ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్‌లు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో 'టక్ జగదీష్' చేరింది. ఈ మేరకు నాని ట్వీట్ చేశారు. జగదీష్ జాయిన్ అయ్యాడు. టక్ మొదలైంది'.. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. టక్ చేసుకుని, పక్కన మాస్క్ తగిలించుకుని వెనుక నుంచి తీసుకున్న ఫొటోను నాని ఈ ట్వీట్ లో జత చేశాడు.ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది.. అనుకున్న టైమ్ లో షూటింగ్ పనులు పూర్తయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారట..


 

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM