2020 లో టాలీవుడ్ మూవీస్ రిపోర్ట్ టాప్‌లో స్టార్ హీరోస్

by సూర్య | Wed, Apr 01, 2020, 12:03 PM

2020లో అపుడే మూడు నెలలు గడిచిపోయాయి. ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్స్ మూతపడ్దాయి. లేకపోతే పరిస్థితి వేరే ఉండేదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూడు నెలల్లో ఏయే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయో చూద్దాం. 2020 యేడాది తెలుగులో రజినీకాంత్ ‘దర్బార్’తో సినీ సందడి మొదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో పలకరించారు. ఈ రెండు సంక్రాంతి బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి 2020కు మంచి శుభారంభాన్ని ఇచ్చాయి. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 150 కోట్ల షేర్ రాబట్టి హీరోగా మహేష్ బాబు స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. మరోవైపు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా రూ. 158 కోట్ల వరకు వసూళు చేసింది. అల్లు అర్జున్ నటనకు త్రివిక్రమ్ మాయా జాలం పనిచేసిన ఈ సినిమా సంక్రాంతి సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.పండగ చివర్లో కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ సినిమాతో పలకిరంచాడు.  ఈ సినిమా ఆశించిన విజయం దక్కలేదు.ఇక  రవితేజ డిస్కోరాజా సినిమాతో పలకరించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. జవవరి చివరల్లో  నాగ శౌర్య‘అశ్వథ్థామ’తో పలకరించాడు. ఈచిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది.  ఇక ఫిబ్రవరి‌లో సమంత జాను సినిమాతో పలకరించింది. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా.. ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ఇష్టపడలేదు. మరోవైపు ప్రేమికుల రోజున  విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది.ఆ తర్వాత ‘భీష్మ’గా వచ్చిన నితిన్ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రం మొత్తంగా రూ. 27 కోట్ల షేర్ అందుకుంది.  అటు చివరగా నాని నిర్మాతగా విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన ‘హిట్’తో మంచి ముగింపు పలికాడు. ఈచిత్రం మొత్తంగా రూ. 6 కోట్ల షేర్ రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మార్చిలో ‘ ‘పలాస 1978’ సినిమాతో ఒకటి రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో పలాస సినిమాకు టాక్ బాగున్నా.. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమాకు కలెక్షన్లు రాలేదు. ఆ తర్వాత కరోనా  మహామ్మారి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్ మూసేస్తున్నట్టు ప్రకటించింది. ఇక రాబోయే సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మహామ్మారి తగ్గుముఖం పడితే కానీ థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితులు లేవు.



Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM