ఆ హీరోతో పెళ్లి ఖాయమంటున్న ‘గుత్తా జ్వాల’ !

by సూర్య | Wed, Apr 01, 2020, 10:54 AM

స్టార్ బ్యాడ్మింటన్‌ ప్లేయర్ గుత్తా జ్వాల తమిళ హీరో విష్ణు విశాల్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో వీరిరువురు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జ్వాల, విష్ణు విశాల్‌తో తన సంబంధాన్ని బయటపెట్టింది. అంతేకాదు మేమిద్దరం త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్టు ప్రకటించింది. మంచి సమయం చూసుకుని త్వరలోనే తమ వివాహంపై అధికారిక ప్రకటన చేస్తామని ఆమె తెలిపారు.కొన్నేళ్లు క్రితం బాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది జ్వాల. కాగా కొన్ని కారణాల వలన వీరిరువురూ విడిపోయారు. మరోపక్క విష్ణు విశాల్ కూడా ఇంతకుముందే పెళ్లి చేసుకొని తన భార్య నుండి విడాకులు తీసుకున్నాడు. మొత్తానికి ఇప్పటికి వీరిరువురి ప్రేమాయణాన్ని బయటపెట్టింది గుత్తా జ్వాల.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM